టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ ఇంట విషాదం

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ ఇంట విషాదం

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ ఇంట విషాదం నెలకుంది. శ్రీకాంత్‌కు తండ్రి మేక పరమేశ్వరరావు (70) ఆదివారం అర్ధరాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతోన్న పరమేశ్వరరావు గత నాలుగు నెలల నుంచి స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సోమవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు శ్రీకాంత్‌ ఇంటికి చేరుకుంటున్నారు. ఆయనకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.