వైభ‌వంగా కోడి రామ‌కృష్ణ చిన్న కుమార్తె వివాహం.. తరలివచ్చిన తారాలోకం

వైభ‌వంగా కోడి రామ‌కృష్ణ చిన్న కుమార్తె వివాహం.. తరలివచ్చిన తారాలోకం

ప్రముఖ ద‌ర్శకుడు స్వర్గీయ కోడి రామ‌కృష్ణ చిన్న కుమార్తె ప్రవ‌ల్లిక, మహేష్‌ల వివాహం వైభవంగా జరిగింది. బుధ‌వారం రాత్రి 9.36 నిమిషాల‌కు ప్రవల్లిక, మహేష్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్ గండిపేట‌లోని క‌న్వెష‌న్స్ అండ్ ఎగ్జిబిష‌న్స్‌లో ఈ వివాహ వేడుక జరిగింది.

కోడి రామ‌కృష్ణ స‌తీమ‌ణి కోడి ప‌ద్మ ఆహ్వానం మేర‌కు తెలుగు చ‌ల‌న‌చిత్ర ప్రముఖులు, రాజ‌కీయ ప్రముఖులు ఈ వివాహ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. పెళ్లికి విచ్చేసిన వారిలో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ, మోహ‌న్ బాబు, కె.రాఘ‌వేంద్రరావు, ముర‌ళీ మోహ‌న్‌, గోపీచంద్‌, జ‌య‌ప్రధ‌, జీవిత‌ విచ్చేశారు.