దర్శకుడు, నటుడు గిరిధర్‌ మృతి

టాలీవుడ్‌లో దర్శకుడిగా నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్న గిరిధర్ (64) తుది శ్వాస విడిచారు. గత ఆరు నెలల క్రితం ఒకసారి జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు గిరిధర్. అప్పటి నుంచి దర్శకుడు మంచానికే పరిమితమయ్యారు. అయితే ఈ క్రమంలోనే అతని ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో ఆదివారం తిరుపతిలోని తన సొంత నివాసంలో కన్నుమూశారు.