టాలీవుడ్‌లో విడాకులకు సిద్ధమైన మరో జంట

 శ్రీను వైట్ల నుండి విడాకులు కావాలని రూపా వైట్ల కోర్టు మెట్లేక్కారు నీ కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఆయన ఆనందం సినిమాతో హిట్‌ కొట్టాడు.  ఢీతో కామెడీ యాంగిల్‌ను పరిచయం చేసిన ఈ దర్శకుడు… మహేష్‌బాబుతో దూకుడు తీసి బ్లాక్‌ బ్లస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ఆస్థాయి హిట్‌ కొట్టలేదని చెప్పాలి. కెరీర్‌ మొదట్లోనే రూపను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన సినిమాల్లో రూపా స్టైలిష్ట్‌గా పనిచేశారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. అయితే ఇటీవల కాలంలో ఆయన తీసిన పలు సినిమాలు ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్‌, అమర్‌ అక్బర్‌ అంటోనీతో వైఫల్యాలను చవిచూడటంతో ప్రొఫెషనల్‌, పర్సనల్‌ లైఫ్‌లో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. మంచు విష్ణుతో  ఢీ సీక్వెల్ ఢీ2ను ప్రకటించినప్పటికీ.. ఇంకా సెట్స్‌ పైకి వెళ్లలేదు.