సింగర్‌ కౌసల్యకు కరోనా

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ (Coronavirus) మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. మూడో దశలో ఎన్ని జాగ్ర‌త్తలు తీసుకుంటున్నా.. వైర‌స్ ఏదో రూపంలో ఎటాక్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా రాజ‌కీయ నాయకులు, సినీ స్టార్లు, ప‌లువురు సెల‌బ్రిటీలను క‌రోనా వెంటాడుతూనే ఉంటోంది. మూడో దశలో ఇప్ప‌టికే ఎంతో మంది వైర‌స్ బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ సింగర్ కౌసల్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.