రక్తదానం చేసిన మాజీ ఎంపీ కవిత
రక్తదానం చేసిన మాజీ ఎంపీ కవిత

రక్తదానం చేసిన మాజీ ఎంపీ కవిత

యువత రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారంరోజుల పాటు రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత రక్తదానం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు వీలైనంత ఎక్కువగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.