నేడే తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

నేడే తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల కానున్నాయి. ఫస్టియర్‌, సెకండియర్‌ జనరల్‌, ఒకేషనల్‌ ఫలితాలు ఒకేసారి విడుదలయ్యేట్లు ఏర్పాట్లు పూర్తి చేశారు.

మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేస్తారని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు.