జగన్ సర్కార్‌పై యూకే డిప్యూటీ హైకమిషనర్ ప్రశంసలు..

జగన్ సర్కార్‌పై యూకే డిప్యూటీ హైకమిషనర్ ప్రశంసలు..

కరోనా కట్టడికి జగన్ సర్కార్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. టెస్టుల సంఖ్యను భారీగా పెంచింది.. అలాగే పొరుగు రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వస్తున్నవారిపై ఫోకస్ పెట్టింది. టెస్టుల్లోనూ రికార్డులు సృష్టిస్తోంది.. ఇప్పటి వరకు ఏడు లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించింది. అంతేకాదు ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శం నిలుస్తోంది. అయితే కరోనా కట్టడిలో జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యలకు ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా

యూకే డిప్యూటీ హై కమిషనర్ ఫ్లెమింగ్ ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేత పీవీపీ ట్వీట్ చేశారు.

కరోనా కట్టడి విషయంలో ఏపీ మోడల్‌ను ప్రపంచానికి రికమెండ్‌ చేసినందుకు యూకే డిప్యూటీ హై కమిసనర్ ఫ్లైమింగ్‌కు పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ధన్యవాదాలు తెలిపారు. టెక్నాలజీ సాయంతో ప్రతి 50మందిని మ్యాపింగ్ చేస్తున్నామని.. దీనికి తగిన ఫోర్స్ తమకు అండగా ఉందన్నారు. ఫ్లెమింగ్ చేసిన ట్వీట్‌‌కు రిప్లై‌గా ఇచ్చారు పొట్లూరి.