వరలక్ష్మి కి కాబోయే భర్తకు ఆల్రెడీ పెళ్లయిందా..?

సౌత్ లో లేడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకెళ్తున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల నికోలయ్ సచ్‌దేవ్ అనే ఓ ఆర్ట్ గ్యాలరిస్టుని నిశ్చితార్థం చేసుకుంది. దీంతో అందరూ ఈ జంటకి శుభాకాంక్షలు చెప్పారు. అయితే వరలక్ష్మి చేసుకోబోయే ఈ నికోలయ్ కి ఆల్రెడీ పెళ్లి అయిందని సమాచారం. నికోలయ్ గతంలో కవిత అనే ఓ మోడల్ ని వివాహం చేసుకొగా.. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్నేళ్ల క్రితమే నికొలయ్-కవిత విడాకులు తీసుకున్నారని సమాచారం. కవితతో విడాకులు తీసుకున్నాకే వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమలో పడి వివాహం చేసుకోబోతున్నాడట.
ఈ విషయం తెలియడంతో అంత పెద్ద నటి రెండో పెళ్లి చేసుకునే వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకోవడంఅంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో వరలక్ష్మి అసలు పెళ్లే చేసుకోను అని చెప్పింది. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోబోతుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక కొంతమంది అతని గతం గురించి మనకెందుకు, ఆల్రెడీ విడాకులు తీసుకున్నారు, ఇప్పుడు కొత్త జీవితం మొదలుపెట్టబోతున్నారు అని పాజిటివ్ గా కూడా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అసలు పెళ్లే చేసుకోను అన్న వరలక్ష్మి ఇప్పుడు నికోలయ్ సచ్‌దేవ్ ని నిశ్చితార్థం చేసుకోవడంతో వైరల్ టాపిక్ గా మారింది.