సినీ పరిశ్రమలో వరుస విషాదాలు.. ప్రముఖ నటుడు ఏఎల్ రాఘవన్ కన్నుమూత

సినీ ఇండస్ట్రీని వరుస విషాదలు వెంటాడుతున్నాయి. రెండు రోజుల క్రితం ప్రముఖ మలయాళ సినీ రచయిత, దర్శకుడు సాచీ కె.ఆర్.సచ్చిదానందన్ కన్నుమూశారు. ఆ చేదు వార్త మరువక ముందే… తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నేపథ్య గాయకుడు, నటుడు ఏఎల్ రాఘవన్ నిన్న మరణించారు. రాఘవన్ వయసు 80 ఏళ్లు. నిన్న కార్డియాక్ అరెస్ట్‌తో ఆయన కుప్పకూలారు. దీంతో ఆయనను భార్య ఎంఎన్ రాజం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ రాఘవన్ చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని చెన్నైలోని రోయపెట్టాలోని నివాసానికి తరలించారు.