అందుకే ఇంట్లో గొడవపడి బయటకొచ్చా.

అందుకే ఇంట్లో గొడవపడి బయటకొచ్చా.. దయచేసి సహకరించండి: విజయ్ దేవరకొండ

కరోనా విజృంభణనకు బ్రేకులు వేసేందుకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ఈ పీరియడ్‌లో ఎవ్వరూ బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాక్‌డౌన్ సమర్థవంతంగా అమలు చేయడంలో పోలీసులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా రేయింబవళ్లు రోడ్లపైనే ఉంటూ ఎవ్వరూ బయటకు రాకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసు సిబ్బందిని అభినందించారు హీరో విజయ్ దేవరకొండ.

వేసవికాలంలో పోలీసులు ఆరోగ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకోండి అని సూచించారు. కరోనాపై ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్, ప్రజలను అప్రమత్తం చేస్తున్న విధానం భేష్ అని తెలిపారు విజయ్ దేవరకొండ. పోలీసుల శ్రమకు హ్యాట్సాఫ్ అని ఆయన అన్నారు. లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలంతా ఇంట్లో ఉంటే పోలీసులు మాత్రం రోడ్లపై డ్యూటీ చేస్తున్నారు. పేద ప్రజలకూ అన్నదానాలు కూడా చేస్తున్నారు. 24 గంటలు మన కోసం పని చేస్తున్న పోలీసులకు ధన్యవాదాలు. ఈ సమయంలో ప్రజలంతా ఇంట్లోనే ఉంటూ పోలీసులకు సహకరించాలి అని చెప్పారు విజయ్.