నెల్లూరుకు కొత్త ఇంచార్జ్.. జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి..

వైసీపీ ఇంచార్జుల మరో జాబితాను ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. ఒక పార్లమెంట్, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ ఇంచార్జులను ప్రకటించారు. నెల్లూరు పార్లమెంట్ ఇంచార్జిగా విజయసాయిరెడ్డి ఖరారు అయ్యారు. ఈ సందర్భంగా జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు విజయసాయిరెడ్డి. ఇప్పటికే 8 జాబితాను విడుదల చేసిన అధిష్టానం తాజాగా 9వ విడత లిస్టును విడుదల చేసింది. కాగా వచ్చే ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్ దూకుడు పెంచారు. 175 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు.