ప్రాణం పోయేవరకు జగన్ వెంటే ఉంటా – విజయసాయిరెడ్డి

నెల్లూరులోనే నిత్యం ఉంటా..ప్రాణం పోయేవరకు జగన్ వెంటే ఉంటానని నెల్లూరు వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. నేను గెలిస్తే ఢిల్లీకి ఎక్స్ పోర్ట్ అవుతానంట… నెల్లూరును పట్టించుకోనని వేమిరెడ్డి గారు ఛలోక్తులు విసురుతున్నారని ఆగ్రహించారు నెల్లూరు వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయ సాయిరెడ్డి. ఎక్స్‌పోర్ట్‌, ఇంపోర్ట్‌ బిజినెస్‌లు చేస్తున్నందు వలన అలవాటు ప్రకారం ఆయన ఆ పదం వాడి ఉంటారని తెలిపారు.

నాకు ఏ వ్యాపారాలు లేవు. పార్లమెంటు సమావేశాలప్పుడు తప్ప మిగిలిన రోజులు నెల్లూరులోనే ఉంటా. ప్రాణం పోయేవరకు జగన్ గారి వెంటే ఉంటానని తెలిపారు నెల్లూరు వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయ సాయిరెడ్డి. పార్టీలు మారడం నాకు తెలియదు వేమిరెడ్డి గారూ. రాజ్యసభ సభ్యుడిగా ప్రతి రోజూ సభకు హాజరయ్యా. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సమస్యలను ఎక్కువగా ప్రస్తావించింది నేనేనని చెప్పారు. మీరు రాజ్యసభ మెంబరుగా అటు పార్లమెంటుకు రాలేదు. నెల్లూరులో లేరు. వ్యాపార పనుల్లో దేశాలు తిరుగుతున్నారన్నారు నెల్లూరు వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయ సాయిరెడ్డి.