అంబడిపూడి నిర్మలా కుమారి గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాలు

తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ శ్రీలంక కొండ పైన స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి గారి ఆధ్వర్యంలో రూ.35,00,000/- ప్రభుత్వ నిధులతో నూతనంగా ఏర్పాటు చేయనున్నారు. మెట్లు,లాడింగ్స్ మరియు సీసీ డ్రైన్స్ నిర్మాణాలకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా.. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు హాజరైయ్యారు.

నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డివిజన్ అధ్యక్షులు కోటి నాగులు గార్లు మరియు వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలతో కలిసి భూమిపూజ నిర్వహించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అటు గుణదల,కృష్ణలంక,పటమట ప్రాంతాలలో అభివృద్ధి జరగలేదు.. కానీ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 650 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని ప్రజలు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.