ఫ్యామిలీ స్టార్.. ఫస్ట్ అనుకున్న టైటిల్ ఇది కాదు!

పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరో సినిమా చేస్తున్నాడు అనగానే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. పరశురామ్ మొదటి సినిమా సోలో నుంచి ఫ్యామిలీ స్టార్ వరకు అతను ఒకే ఫార్ములా ఫాలో అవుతూ వచ్చాడు. విజయ్ దేవరకొండతో చేసిన గీతాగోవిందం సినిమా టైటిల్ ని హీరో, హీరోయిన్ పాత్రల పేర్ల నుంచి తీసుకున్నాడు.
ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఫ్యామిలీ స్టార్ టైటిల్ కూడా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే రాబోతోంది.
నిజానికి ఈ మూవీకి ముందుగా గోవర్ధన్ అనే టైటిల్ ని అనుకున్నారంట. సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పేరు గోవర్ధన్. టైటిల్ కంటే పబ్లిక్ కి మరింత స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యే టైటిల్ పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు తన ఫ్యామిలీని సంతోషంగా ఉంచాలని అనుకునే ప్రతి వాడు ఆ ఫ్యామిలీకి స్టారే. అందుకే ఈ ఫ్యామిలీ స్టార్ క్యాచీగా జనాల్లోకి వేగంగా రీచ్ అయ్యే విధంగా ఉంటుందని ఫైనల్ గా దీనినే ఖరారు చేసారంట. తాజాగా ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఈ సినిమా టైటిల్ గురించి ఈ విధంగా చెప్పాడు. మరి సినిమా అనుకున్నట్లే ఫ్యామిలీ ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందో లేదో చూడాలి.