దేవర మ్యూజిక్ పై.. విశ్వక్ సేన్ కామెంట్స్..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న దేవర మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్నది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. ఇటీవలే గోవాలో ఓ సాంగ్ చిత్రీకరణ పూర్తీ చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ షూట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
కాగా టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఈ మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. లాస్ట్ నైట్ ఎన్టీఆర్ తో కలిసి విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ పార్టీ చేసుకున్నారు. ఇక ఈ పార్టీలో ఎన్టీఆర్ దేవర సాంగ్స్ ని వినిపించినట్లు తెలుస్తుంది. దీంతో విశ్వక్ సేన్ ఆ పాటలు గురించి మాట్లాడుతూ ఓ పోస్ట్ వేశారు. దేవర మ్యూజిక్ ఉందమ్మా నెక్స్ట్ లెవెల్ అంతే. అనిరుద్ ఇరగొట్టేసాడు. ఈ ఆల్బమ్ ప్రతిఒక్కరికి నచ్చేస్తుంది అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.