ఎంటర్‌టైనింగ్‌ మూవీగా ‘వాంటెడ్‌ పండుగాడ్‌’

కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్‌ కె ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, శ్రీనివాస్‌ రెడ్డి, సుడిగాలి సుధీర్‌ ప్రధాన పాత్రధారులుగా శ్రీధర్‌ సీపాన దర్శకత్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంకట్‌ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘వాంటెడ్‌ పండుగాడ్‌’ పట్టుకుంటే కోటి ట్యాగ్‌ లైన్‌. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ బిగ్‌ టికెట్‌ లాంఛ్‌ చేశారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఎంటర్‌టైనింగ్‌ మూవీగా ‘వాంటెడ్‌ పండుగాడ్‌’ ఆగస్ట్‌ 19న మూవీ రిలీజ్‌ అవుతుందన్నారు. సునీల్‌ మాట్లాడుతూ రాఘవేంద్రరావుగారి సినిమాల్లో పళ్లు ఉంటాయి. కానీ ఈ సినిమాలోనే పండుంది.