ఈ 3 టీలు తాగితే చాలు.. షుగర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది..

యాలకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటితో చేసిన టీ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుందని అంటారు. ఏలకులతో మూడు పద్ధతులలో టీ చేయొచ్చు. యాలకులని ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వాడేవారు. దీనిని వాడడం వల్ల షుగర్ కంట్రోల్ అవ్వడంతో పాటు మరెన్నో లాభాలు ఉన్నాయి. చాలా ఆరోగ్య సమస్యలని ఈ దూరం చేస్తుందని నిపుణులు అంటున్నారు.

చాలామందికి వాళ్ళ టీ లో యాలకులు వేసుకోడం అలవాటే. ప్రాచీన ఆయుర్వేదంలో కూడా దీన్ని వాడేవారని తెలుస్తోంది. దీనిలో ఉండే యాంటీ బయాటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల ఇది జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న అనారోగ్యాలని తగ్గిస్తుంది. ఏలకులు డిప్రెషన్‌ని, రక్తపోటు‌ని తగ్గించడంతో పాటూ, బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. కానీ, యాలకుల వల్ల మధుమేహాన్ని నియంత్రించవచ్చు అన్నది మాత్రం అందిరికీ తెలియకపోవచ్చు. చాలా పరిశోధనలు యాలకుల వాడకానికీ మధుమేహ నియంత్రణకీ సంబంధముందని నిరూపించాయి.

ఒక కప్పు టీ కోసం రెండు యాలక్కాయల్ని దంచి మరుగుతున్న నీటిలో వెయ్యండి. అందులో, టీ పౌడర్, పాలు మీరు మామూలుగా వేసేటట్లే వేయండి. మీరు కొద్దిగా దంచిన అల్లం కూడా యాలకులతో పాటూ మరుగుతున్న నీటిలో వేస్తే, అది మీ టీ రుచిని, ఆరోగ్యప్రయోజనాలని పెంచుతుంది. మీరు కావాలంటే తేనె లాంటిదేదైనా కలుపుకోవచ్చు. అయితే ఈ విషయంలో ఓసారి మీ వైద్యునితో సంప్రదించడం మంచిది.