ఓటీటీలో విడుద‌ల‌వుతున్న నార‌ప్ప

టాలీవుడ్‌ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్‌ నటించిన తాజా చిత్రం ‘నారప్ప’. ఈ మూవీ తమిళ హీరో ధనుష్‌ నుటించిన అసురన్‌ చిత్రానికి రీమేక్‌గా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే కరోనా పరిస్థితుల రీత్యా.. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా ఓటీటీ బాట పట్టింది. మంగళవారం ఈ మూవీ అమెజాన్‌ప్రైమ్‌ వీడియోలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర సహ నిర్మాత, వెంకటేష్‌ సోదరుడు దగ్గుబాటి సురేష్‌బాబు మాట్లాడుతూ.. ‘తమిళంలో అసురన్‌ చిత్రం చూసిన వెంటనే నాకు బాగా నచ్చింది. దీనిని రీమేక్‌ చేయాలనే ఆలోచన రాగానే ఒకానొక సమయంలో శ్రీకాంత్‌ అడ్డాల నా ఆఫీసుకు వచ్చారు. ఆ సమయంలో ఈ సినిమా గురించి మాట్లాడుకున్నాం. వెంటనే తాను డైరెక్ట్‌ చేస్తానని చెప్పడంతో.. నేనుకూడా సరే అన్నాను. ఈ సినిమాకు వెంకటేష్‌ ఎంతో కష్టపడ్డాడు. ఇప్పటివరకు వెంకటేష్‌ ఇలాంటి పాత్రలో నటించలేదు. ఈ సినిమాను తనొక ఛాలెంజ్‌గా భావించి ఎంతో ఇష్టంగా చేశాడు. ఈ సినిమా నిర్మాణంలో ప్రధాన వాటా థానూదే. ఆయనకున్న ఆర్థిక ఒత్తిళ్ల నడుమ థానూ ఓటీటీలో విడుదల చేయాలని అభిప్రాయపడితే.. మేమూ కాదనలేకపోయాం.