మహాలక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఏ పూలతో పూజా చేయాలి?

ఎవరు ఉన్న స్థితిలోని ధర్మాని వారు ఆచరిస్తూ భగవంతుని సేవించాలని బోధించింది. అయితే పిల్లల దగ్గర నుంచి ముసలి వారు వరకు అనేక సమస్యలతో నిత్యం సతమతమవుతుంటారు.

ఇటువంటి వారికి కావల్సిన కోరికలను తీర్చడానికి సులభోపాయాలను సైతం మన రుషులు మనకు అందించారు. వాటి పరంపరలో ప్రకఋతిలోని అనేక సాధనాల్లో పుష్పాలు ఒకటి. ఏ పూలతో పూజ చేస్తే ఏ ఫలితం ఉంటుందో పరిశీలిద్దాం…

పూలు — ఫలితాలు

మల్లె — పాపాలు నశిస్తాయి. బుద్ధి పెరుగుతుంది
పవళ మల్లె — కోరికలు నెరవేరుతాయి. మంచి ఆలోచనలు వస్తాయి
తెల్ల తామర — ముక్తి లభిస్తుంది
ఎరుపు పూలతో — ఆత్మైస్థెర్యం, కుజగ్రహ, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
గన్నేరు పూలతో — శివుని అనుగ్రహం, ముక్తి లభిస్తుంది
నాగలింగ పుష్పం — ఆర్థిక ఇబ్బందులు పోతాయి
తులసీ దళాలతో — విష్ణు అనుగ్రహం, ఆధ్యాత్మిక భావనలు పెంపొందుతాయి
సంపెగ పూలతో — అన్ని రంగాల్లో అభివఋద్ధి
తామర, శంఖపూలతో –అష్టఐశ్వర్యాలు లభిస్తాయి
మారేడు దళాలతో — జ్ఞానం, ఐశ్వర్యం, శివ, విష్ణు, లక్ష్మీ అనుగ్రహం
ఎర్రమల్లె పూలతో — శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహం
విష్ణుక్రాంతం — గణపతి, విష్ణు అనుగ్రహం
పసుపు పూలతో — గురు, బుధ గ్రహాల అనుగ్రహం
ఎరుపు పూలతో — కుజ గ్రహ అనుగ్రహం
తెల్ల పూలతో — సూర్యుడు, శుక్రుడు అనుగ్రహం
నల్ల పూలు — శని, రాహు, విష్ణుమూర్తి అనుగ్రహం
రంగురంగుల పూలు — కేతు గ్రహ అనుగ్రహం