అందరూ కచ్చితంగా మాస్క్ వాడాలా..

కరోనా చెలరేగుతున్న వేళ ప్రతి ఒక్కరూ కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ వచ్చాక బాధపడే బదులు.. రాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. దీంతో ఎలాంటి సమస్యలు మనవరకూ రావు. ఇప్పటికే ఇంటి నుంచి ఎవరికీ బయటికి రావడం లేదు. ఒక వేళ వచ్చినా మాస్క్‌లు ధరిస్తున్నారు. ఇది చాలా మంచి విషయం అయితే, అందరూ మాస్క్‌లు ధరించాలా అంటే అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు. వీటిని వాడేందుకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు అవేంటో తెలుసుకోండి..

మాస్క్ ఎలా వాడాలి.. దానిని ఎలా పారేయాలి.

  • మాస్క్‌ని ముట్టుకునే ముందు ప్రతి ఒక్కరూ ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్, సబ్బుతో గానీ చేతులని శుభ్రం చేసుకోవాలి.
  • మాస్క్ వాడే ముందు దానికి రంధ్రాలు కానీ, చిరుగుళ్లు ఉన్నాయో లేదో చూడాలి.
  • మెటల్ స్ట్రిప్ ఎటువైపు ఉంటుందో అదే పై భాగం అన్నట్లు.
  • మాస్క్ ఎటువైపు కరెక్ట్‌గా ఉందో చూసి వాడాలి. ఏది పై భాగమో కలర్‌ని చూస్తే తెులసుకోవచ్చు.
  • మాస్క్ మీ ముఖంపై కర్టెక్ట్‌గా పెట్టుకోండి. ఈ సమయంలో స్ట్రిప్ భాగం మీ ముక్కుపై ఉండేలా ఉంటే సరిగ్గా వాడుతున్నట్లు.
  • ఇప్పుడు మాస్క్‌ని కిందికి లాగితే అది మీ నోరు, గదవ భాగాన్ని కవర్ చేస్తుంది.
  • మాస్క్ వాడిన తర్వాత దానిని ఎలాస్టిక్ లూప్స్.. అంటే మనం చెవులకి తగిలించే దారాలతో మెల్లిగా తీయాలి.. అంతే కానీ, మధ్యభాగంలో పట్టుకోవద్దు.. అలా తీసి పారేయాలి.
  • వాడిన మాస్క్‌ని వెంటనే చెత్తకుండిలో పారేయండి.
  • అదే విధంగా మాస్క్‌ తీసిన తర్వాత చేతులని మరోసారి శుభ్రంగా ఆల్కహాల్ బేస్డ్ వాష్‌తో, సబ్బుతో కానీ చేతులని శుభ్రం చేసుకోవాలి.