ఈ రోజు దిల్ రాజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ రేన్నా…

తెలుగు సినీ ఇండస్ట్రీలో దిల్ రాజుకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన మొదట్లో డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉండి ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి టాలీవుడ్ ని శాసించే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఏ సినిమా విడుదలైన దిల్ రాజు హెల్ప్ లేనిదే బయటకు రాలేని పరిస్థితి. అయితే ఈ స్థాయి కారణం ఒక రోజు పడిన కష్టం కాదు.. దాని కోసం దిల్ రాజు చాలానే మెట్లు ఎదగాల్సి వచ్చింది. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా విడుదలవుతుంది అంటే దానికి సంబంధించిన థియేటర్స్ విషయం వచ్చేసరికి దిల్ రాజు పేరు అందరికన్నా ముందు ఉంటుంది. అయితే ఆయన ఈరోజు ఈ స్థాయికి రావడానికి ముఖ్య కారణం జూనియర్ ఎన్టీఆర్ అనే విషయం ఎవరికీ తెలియదు.

దిల్ రాజ్ కేవలం సినిమాపై ఉన్న ఇష్టం తో డిస్ట్రిబ్యూషన్ రంగం లోకి వచ్చారు. అయితే నైజాం ఏరియాలో పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ డబ్బులు అర్జించేవారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆదికు సంబంధించిన నైజాం హక్కులను దిల్ రాజు కొనుక్కున్నారు ఆ టైంలో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో డబ్బుల వర్షం కురిసింది.

ఆ డబ్బులను నిర్మాణ రంగంలోకి పెట్టి దిల్ ను తీశారు. హీరో నితిన్ నటించిన ఈ మూవీ కూడా హిట్ కావడంతో రాజు మరింత లాభాల బాట పట్టారు. అక్కడ మొదలైన దిల్ రాజు సక్సెస్ నేడు అన్ని సినిమాలను శాసిస్తూ థియేటర్స్ ని గుప్పెట్లో పెట్టుకొని టాలీవుడ్ పై మకుటం లేని మహారాజులా కూర్చున్నారు.