శివుడికి అభిషేకం పాలతోనే ఎందుకు చేస్తారు ..?

సోమవారం ఆ మహా శివునికి ఇష్టమైన రోజు.. శివుడు అభిషేక ప్రియుడన్నది జగమెరిగిన సంగతే.. ఎన్నో రకాల అభిషేకాలు శివయ్యకు చేస్తూ ఉంటాం. మరి అన్ని అభిషేకాల్లోకి పరమేశ్వరుడుకి అత్యంత ఇష్టమైన అభిషేకం పాలతో చేసేది.

అయితే ఇక్కడ చాలా మందికి శివలింగానికి పాలతోనే అభిషేకం ఎందుకు చేస్తారు? అని సందేహం ఉంటుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. శివరాత్రి రోజు, మహాశివుడు తాండవం ఆడతాడని భక్తులు అపార నమ్మకం. తాండవం చేయడం అంటే, విశ్వాన్ని సృష్టించేది. విశ్వాన్ని ప్రళయంతో అంతం కూడా చేస్తుంది. తాండవం ఆడుతూ ఉగ్రంగా ఉండే శివుడిని శాంతింపజేయడానికి పాలను ఎంచుకున్నారు.

ఎందుకంటే పాలు అనేది సాత్విక ఆహారం. కాబట్టి ఆయనకు పాలతో అభిషేకం చేస్తారు. అంతే కాకుండా పాలతో పాటు తేనెను కూడా అభిషేకాల్లో శాంతింప చేయడానికి ఉపయోగిస్తారు. ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. మహాశివరాత్రి రోజే సముద్ర మథనం జరిగిగా… అందులో ఉద్భవించిన విషాన్ని మహాశివుడు తన కంఠంలో దాచుకోవడ౦తో శివుడికి… నీలకంఠుడు అని పేరు పెట్టారు. గరళంతో భగభగ మండిపోతున్న శివుడి గొంతును ఉపశమింపజేయడానికి దేవతలు పాలు పోయడంతో శివుడు శాంతించాడు.