కివీస్ పండ్లను తింటున్నారా? అయితే జాగ్రత్త..!

కివీస్‌ను ఎందుకు తినాలో తెలుసా? కివీస్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి? కివీస్, లేదా కివి ఫ్రూట్స్ పిలుస్తారు. ఇందులో అనేక పోషకాలు లభించాడంతో ఆరోగ్యకరమైన పండుగా చెబుతారు. మూఖ్యంగా డెంగ్యూ లేదా వైరల్ ఫీవర్ వచ్చినవారిలో ప్లేట్ లెట్స్ తగ్గిననప్పుడు కివీ పండ్లను ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే, ఈ కివీస్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, కె, ఇ, పొటాషియం, ఫోలేట్ అధిక మొత్తంలో ఉంటాయి. కివీస్ డైటరీ ఫైబర్‌ను కూడా అందించాడంతో జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. కివీస్ తీసుకోవడం వల్ల కలిగే అనేక ఆరోగ్యప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

*కివీస్ విటమిన్ సి కలిగి ఉంనందున్నా రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. ఆరోగ్యకరమైన చర్మం, బలమైన కణజాలాలకు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
*కివీస్‌లో విటమిన్ సి, ఇ, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవీ ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని రక్షించడంలో సాయపడి… దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
*కివీస్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉండటంతో ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిచి…. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
*ఈ ఫ్రూట్ మెదుడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
*కివీస్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఉబ్బసం కలిగిన శ్వాసకోశ లక్షణాలు, తీవ్రతను తగ్గించడంలో సాయపడవచ్చునని అధ్యయనాలు సూచిస్తున్నాయి.