క్రేజీ అఫర్ అందుకున్నా సామ్…

సినిమాలకు ఏడాది గ్యాప్ తీసుకున్న సామ్‌కు అదిరిపోయే ఆఫర్. మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంది. ఇక సామ్ చివరిగా ఖుషి లో నటించింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామర్ డోస్ మరింత పెంచి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామకు ఓ క్రేజీ అఫర్ వచ్చిందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఓ స్టార్ హీరోతో సమంత జతకట్టనుంది టాక్ వినిపిస్తుంది.

తాజా సమాచారం ప్రకారం సమంత ,దళపతి విజయ్ కు జోడిగా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇంతకుముందు మెర్సల్‌, తేరి చిత్రాల్లో సమంత , విజయ్‌తో జత కట్టారు. అయితే విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం విజయ్ గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్ అనే సినిమా చేస్తున్నారు. ఈవెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున ఈ చిత్రంలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నడు. ఈ సినిమా తర్వాత దళపతి విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్తారని టాక్ వినిపిస్తుంది. మరోవైపు విజయ్ మరి కొన్ని సినిమాలు కూడా కమిట్ అయ్యాడని తెలుస్తోంది. అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే మురగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా , వెట్రిమారన్, ఆర్జే బాలాజీ, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో విజయ్ సినిమాలు చేసే అవకాశం ఉందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. వీటి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా ముందుండే ఛాన్స్ కనిపిస్తుందట. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అదే నిజమైతే నిజంగానే సమంతకు సాలిడ్ కంబ్యాక్ అవుతుందని అంటున్నారు అభిమానులు.