నా ప్రాంత అభివృద్ధి కోసమే స్టూడియో: మహి

హర్సిలీహిల్స్లో ప్రభుత్వం తనకు 2 ఎకరాలు ఇచ్చిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై యాత్ర-2 డైరెక్టర్ మహి.వి.రాఘవ్ స్పందించారు. ‘నేను 100 ఎకరాలు అడగలేదు. సొంత ప్రయోజనాల కోసం అయితే HYD, వైజాగ్లో అడిగేవాడిని. వెనుకబడిన నా ప్రాంత అభివృద్ధి కోసం 2 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరా. గ్రామీణ ప్రజల కోసమే హర్సిలీహిల్స్లో మినీ స్టూడియో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నా’ అని ట్వీట్ చేశారు.