వైసిపి సీనియర్‌ నేత గున్నం నాగిరెడ్డి కరోనాతో మృతి

వైసిపి సీనియర్‌ నేత గున్నం నాగిరెడ్డి (81) మంగళవారం ఉదయం మృతి చెందారు. కొద్ది రోజులుగా ఆయన కరోనాతో పోరాడుతూ విజయవాడలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఈరోజు కన్నుమూశారు. స్వగ్రామం అయిన చింతలపాలెం మండలంలోని దొండపహాడులో నాగిరెడ్డి అంత్యక్రియలను నిర్వహించనున్నారు.