దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి నేడు. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళి అర్పించేందుకు ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల నివాళర్పించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.
