జగన్‌ను చూసి గర్వపడుతున్నా..వైయ‌స్‌ విజయమ్మ

మీ అందరి ప్రేమ సంపాదించిన వైయ‌స్ జగన్‌ను చూసి గర్వపడుతున్నా..అని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయ‌స్‌ విజయమ్మ అన్నారు. నా బిడ్డను నడిపించుకోమని మీకే అప్పజెప్పా. నా బిడ్డను నడిపించిన మీ అందరిపైనా నా అణువణువునా కృతజ్ఞత ఉంది.  మీ బిడ్డల్ని వైయ‌స్ జగన్‌ చేతుల్లో పెట్టండి, వారికి ఉజ్వల భవిష్యత్‌ అందిస్తార‌ని చెప్పారు. మీతో నా అనుబంధం ఈనాటిది కాదు, 45 ఏళ్ల​ అనుబంధం ఉంది. ఇకపైనా ఈ అనుబంధం కొనసాగాలి అంటూ వైయ‌స్‌ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు.