రెండో విడత రైతు భరోసా విడుదల చేసిన జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపావళి సంబరాలు ముందే ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు మూడు పథకాలకు సంబంధించి రూ.2,190 కోట్లు జమ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయం నుంచి వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవా పథకాలకు సంబంధించి రైతులు, రైతు గ్రూపు ఖాతాల్లోకి నగదు జమ చేశారు. వ్యవసాయానికి దన్నుగా వందకు వంద ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.