హైదరాబాద్‌ను ఏపీ రాజధానిగా కొనసాగించాలి –వైవీ సుబ్బారెడ్డి

వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన అంశానికి తెరలేపారు. హైదరాబాద్‌ను ఏపీ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైవీ సుబ్బ రెడ్డి డిమాండ్ చేశారు. రాజ్య సభలోనూ దీనిపై చర్చిస్తామన్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జగన్ పార్లమెంట్ మెట్లు ఎక్కించే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికీ అవకాశం కలిపిస్తున్నారని తెలిపారు.

మాకు ఇచ్చిన ఈ అవకాశం తో ముగ్గురుం కూడా విజయం సాధిస్తామన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి. మళ్ళీ జగన్ ప్రభుత్వం అధికారంలో కి రావాలని ప్రజలు అందరు కోరుకుంటున్నారని… సంక్షేమ కార్యక్రమాలకు జగన్ పెద్ద పీట వేశారన్నారు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి. కాగా రాజ్యసభ అభ్యర్థులలో వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఉన్న సంగతి తెలిసిందే.