అనుమానంతోనే అనూష హత్య : ఎస్‌పి

అనుమానంతోనే అనూషను తోటి విద్యార్థి విష్ణువర్థన్‌రెడ్డి హత్య చేశాడని నరసరావుపేట రూరల్‌ ఎస్‌పి విశాల్‌గున్నీ తెలిపారు. నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని హత్యోదంతం సంచలనం రేపింది. శుక్రవారం ఎస్‌పి విలేకర్ల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అనూష వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని విష్ణుకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే ఈనెల 24న అనూషను నరసరావుపేటకు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆమె గొంతు నులిమి చంపాడు. అనంతరం అక్కడ సాక్ష్యాధారాలు లేకుండా చేయాలని ప్రయత్నించాడని పేర్కొన్నారు. దీనికి సంబంధించి నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని, వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని కోర్టును కోరనున్నట్లు ఎస్‌పి వివరించారు.