స్థానిక ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించాలంటూ ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి లలిత్.. రేపు రెగ్యులర్ లిస్ట్‌లో కేసును విచారణకు ఉంచాలని సూచించారు. అలాగే స్థానిక ఎన్నికలను వెంటనే జరిపించాలంటూ ఏపీ హైకోర్టులో సైతం ఇప్పటికే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. తాండవ యోగేష్, జనార్ధన్ అనే ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా.. లంచ్ మోషన్ పిటిషన్‌కు హైకోర్టు ధర్మాసనం అనుమతించింది. నేటి మధ్యాహ్నం ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది.

ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం