ఎపి, ఒడిస్సాలపై అసాని ప్రభావం

ఎపి, ఒడిస్సాలపై అసాని తుఫాను తీవ్ర ప్రభావం చూపనుంది. తుఫాను ఎపిలోని తూర్పుతీరంలో కేంద్రీకృతమైందని, గంటకు 105 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండి) తెలిపింది. తుఫాను క్రమంగా బలహీన పడుతోందని, మంగళవారం రాత్రి నుండి ఎపిలోని ఉత్తర కోస్తాతో పాటు ఒడిస్సాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. ఇప్పటికే ఎపిలోని విశాఖ పట్నం పోర్ట్‌ను మూసివేశారు. వాతావరణ అననుకూల పరిస్థితుల కారణంగా 23 విమానాలను రద్దు చేసినట్లు విశాఖ పట్నం అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.