ఏపీలో కొత్తగా 25 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 25 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,230కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 9,880 శాంపిల్స్‌ను పరీక్షించగా 25 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిందని తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 3, శ్రీకాకుళం జిల్లాలో 7, విశాఖపట్నం జిల్లాలో 3 కేసులు ఉన్నాయి. ఇందులో ప్రకాశంలో ముగ్గరు, చిత్తూరులో ఒక్కరు, కర్నూలులో ఒక్కరు.. తమిళనాడు కోయంబేడు మార్కెట్‌ నుంచి వచ్చివనారు ఉన్నారు.