ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం కొత్తగా 33 కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2051కి చేరుకుంది. గత 24 గంటల్లో 10,730 మంది శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 33 మందికి కరోనా సోకినట్టుగా నిర్థారణ అయింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 9, కర్నూలు జిల్లాలో 9 చొప్పున, కృష్ణా జిల్లాలో 4, పశ్చిమ గోదావరి జల్లా నుంచి ఒక కరోనా కేసు నమోదైంది.
