ఏపీ లో 1016 కు పెరిగిన కరోనా కేసులు

ఏపీలో గత 24 గంటల్లో నిర్వహించిన కోవిడ్‌ 19 పరీక్షల్లో 61 కేసులు పాజిటివ్‌ గా నమోదయినట్లు ఎపి వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం బులిటెన్‌ను విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం ఎపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1016 కు పెరిగింది. ఈ మొత్తం 1016 పాజిటివ్‌ కేసులకుగాను 171 మంది డిశ్చార్జ్‌ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 814. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6928 శాంపిల్స్‌ ని పరీక్షించగా, 61 మంది కోవిడ్‌ 19 పాజిటివ్‌ గా నిర్థారించబడ్డారు.