మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఎత్తివేయడం సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తివేయలేమని.. ఈ విషయంపై సలహాలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు.. త్వరలోనే ముఖ్యమంత్రులతో చర్చిస్తానని తెలిపారు. మానవాళి మనుగడకు సవాలుగా పరిణమించిన కరోనా వైరస్ కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు పార్లమెంటు ఫ్లోర్ లీడర్లతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఎత్తివేసే ఆలోచన లేదు: మోదీ