అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 7 గంటలకూ దుకాణాలు తెరవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నందున ఆమేరకు దుకాణాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కరోనా వైరస్‌పై సీఎం జగన్ తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను వివరించారు. ఇతర రాష్ట్రాల్లోని ఏపీకి చెందిన వలస కార్మికులు, అలాగే రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల అంశాలపై సీనియర్ అధికారి కృష్ణబాబు వివరాలు అందించారు. విదేశాల్లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన వారు రేపటినుంచి రావటం మొదలవుతుందని తెలిపారు

కరోనా నివారణపై చర్యలపై సీఎం జగన్ రివ్యూ మీటింగ్