‘కల్కి’ నుంచి అప్డేట్.. బుజ్జి ఎవరంటే?

kalki-a.jpg

స్టార్ హీరో ప్రభాస్ ‘కల్కి 2898AD’ చిత్రం నుంచి స్క్రాచ్ వీడియో-4ను మేకర్స్ విడుదల చేశారు. ‘బుజ్జి’ పాత్రను పరిచయం చేస్తూ ఆ వీడియో సాగింది. బుజ్జి అంటే ప్రభాస్ వాడే వాహనంగా తెలుస్తోంది. ‘నా లైఫ్ అంతే. బాడీ లేకుండా బతికేయాల్సి వస్తుందేమో’ అని బుజ్జి చెప్పగా.. ‘నీ టైమ్ మొదలైంది బుజ్జి’ అంటూ ప్రభాస్ ఆ వాహనాన్ని చూపించబోతారు. ఇంతలోనే ట్విస్ట్ ఇచ్చిన మేకర్స్ బుజ్జిని 22న రివీల్ చేస్తామని ప్రకటించారు.

కాగా, సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాని మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న సంగతి తెలిసిందే.

Share this post

scroll to top