సీఎం కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని టీజేఎస్ అధినేత కోదండరామ్ మండిపడ్డారు. అధికార పార్టీ నేతల మాట వినడం లేదనే.. కలెక్టర్లపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. కలెక్టర్ల క్షేత్రస్థాయి పర్యటనతో ప్రజా సమస్యలు బయటకొస్తున్నాయన్నారు. ప్రజా సమస్యలు బయటకు రావటం ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. అలాగే కలెక్టర్లకు మంచి పేరు రావటం కూడా ప్రభుత్వ పెద్దలకు రుచించడంలేదని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌పై మండిపడ్డ కోదండరాం