చంద్రబాబు ఎందుకు సైలెంట్ గా ఉన్నావ్ - విజయసాయి రెడ్డి
చంద్రబాబు ఎందుకు సైలెంట్ గా ఉన్నావ్ - విజయసాయి రెడ్డి

చంద్రబాబు ఎందుకు సైలెంట్ గా ఉన్నావ్ – విజయసాయి రెడ్డి

చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఎప్పుడూ తప్పుడు మాటలతో వార్తల్లో నిలిచే చంద్రబాబు ఆయన సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ దాడులు జరుగుతున్నా సైలెంట్‌గా ఉన్నారెందుకని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో..మాజీ పీఏతోపాటు తాను పెంచి పోషించిన అవినీతి సర్పాలపై జరుగుతున్న ఐటీ సోదాలపై చంద్రబాబు నోరువిప్పడం లేదు. నిప్పు కణికల్లాంటి వారిపై ఈ దాడులేంటని ఐటీ శాఖను నిలదీయాలి. రెండ్రోజులుగా కిక్కురుమనకుండా, కియా లేచిపోతోందని ఫేక్ వార్తలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు అని పేర్కొన్నారు.