చిలగడదుంప ఆరోగ్య ప్రయోజనాలు

చిలగడదుంప.. దీన్నే స్వీట్ పొటాటో అని కూడా అంటారు. పేరుకు తగినట్లే.. ఇది ఎంతో టేస్టీగా.. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అందుకే, దీన్ని ఆహార ప్రియులు ఇష్టంగా ఆరగిస్తారు. అయితే, చాలామందికి ఇందులోని ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలీదు. ముఖ్యంగా చలికాలంలో వీటిని తింటే.. ఈ సీజన్లో తలెత్తే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి.. చిలగడదుంపల్లో ఉండే ఆ ప్రత్యేకతలు ఏమిటో చూసేద్దామా!

చిలగడదుంపల్లో శరీరానికి మేలు చేసే విటమిన్ C, E, B6, బీటా కేరోటిన్, పొటాషియం, ఐరన్‌, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.
ఈ దుంపలో కెరోటినాయిడ్స్, బీటా కెరోటిన్ అధికం. ఇవి శరీరంలో విటమిన్-A తయారు చేయడానికి ఉపయోగపడతాయి.
కణాల సామర్థ్యాన్ని పెంచి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు ఈ చిలగడదుంప సహకరిస్తుంది.
ఈ దుంప తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెంచుతుంది. కాబట్టి రోగ నిరోధక శక్తి కోసం వీటిని కూడా డైట్‌లో చేర్చుకోవచ్చు.
వీటిలో ఉండే విటమిన్-C.. వింటర్‌లో వచ్చే జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది.
డయాబెటీస్ (మధుమేహం) బాధితులు కూడా వైద్యుల సలహా తీసుకుని తగిన పరిమితిలో తినొచ్చని, ఈ దుంప తియ్యాగా ఉన్నా.. చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందట.