టీఆర్ఎస్ సర్కార్‌పై మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని.. రైతు బంధు ఎన్నికల బందుగా మారిందని విమర్శించారు. రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దీనిపై బహిరంగ చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు. లిక్కర్ ధరలు పెంచుతున్న కేసీఆర్.. పంటలకు ధరలు ఎందుకు పెంచడం లేదన్నారు. ఇదిలా ఉంటే.. ‘మై హోమ్’ రామేశ్వరరావు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ జరగడం వెనక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఉన్నారని.. దానిపై స్పందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్, రామేశ్వర్రావు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదంతా జైజ్యోతి సిమెంట్స్‌ను తిరిగి తెరిపించి.. రామేశ్వర్‌రావుకు ఆర్థిక ప్రయోజనం కల్పించడానికేనన్నారు. లంబాడీలను ఎస్టీల జాబితా నుంచి తొలగించాలో.. ఉంచాలా అన్న దానిపై బీజేపీ వైఖరి చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ను బలహీనపర్చడానికి బీజేపీ, టీఆర్ఎస్కు బీటీమ్‌గా వ్యవహరిస్తోందని రేవంత్ అన్నారు.

టీఆరఎస్ ,బిజెపి లపై రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి