ట్రంప్‌ దంపతులకు కరోనా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంట్లో కరోనా కలకలం మొదలైంది. ట్రంప్‌తో పాటు, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లు కరోనా బారిన పడ్డారు. తన సలహాదారు హోప్‌ హిక్్స‌కు కరోనా సోకడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ట్రంప్‌, మెలానియాకు ఇద్దరికీ కరోనా సోకినట్లు శుక్రవారం వచ్చిన ఫలితాల్లో నిర్ధారణైంది. తాముద్దిరమూ కరోనా బారిన పడ్డామని, క్వారెంటైన్‌కు వెళ్లామని ట్రంప్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముంగిట..ఇప్పటికే ప్రచారాల్లో బిజీగా గడుపుతున్న ట్రంప్‌కు కరోనా సోకడంతో ఆయన విజయావకాశాలపై పలువురు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.