డీఎస్ కన్నుమూత.. సీఎస్‌కు CM రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

ds-29-.jpg

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు డీఎస్ శనివారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీ‌నివాస్‌కు (డీఎస్‌) అధికారిక లాంఛ‌నాల‌తో అంత్యక్రియ‌లు నిర్వహించేలా త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సీఎస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాగా రేపు(ఆదివారం) నిజామాబాద్‌లో డీ.శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డీఎస్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపి కాంగ్రెస్‌కు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

Share this post

scroll to top