ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుభాష్ చోప్రా రాజీనామా

ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుభాష్ చోప్రా రాజీనామా

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు సుభాష్ చోప్రా రాజీనామా చేశారు. 2015వ సంవత్సరంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 9.7 శాతం ఓట్లు రాగా, ఈ సారి జరిగిన ఎన్నికల్లో ఓట్ల శాతం 4.27 శాతానికి తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు సుభాష్ చోప్రా చెప్పారు.