తల్లి కాబోతున్న హీరోయిన్‌ నమిత.

హీరోయిన్‌ నమిత తల్లికాబోతుంది. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె బేబీ బంప్‌ ఫొటోను సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ చేసింది. అలాగే తన మాతృత్వపు అనుభూతల గురించి పోస్ట్‌లో తెలిపింది. ‘మాతృత్వం.. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నా ముఖంలో చిరునవ్వు వచ్చింది. నేను మారాను, నాలోనూ మార్పు మొదలైంది. ఎన్నోరోజులుగా మాతృత్వ అనుభూతి కోసం ఎదురుచూశా. ఇప్పుడు నా చిన్నారి కిక్స్‌ కొత్త అనుభూతినిస్తున్నాయి. ఈ ఫీలింగ్‌ ఎప్పుడూ లేని కొత్త ఫీలింగ్‌’ అంటూ నమిత పోస్ట్‌లో రాసుకొచ్చింది.