తుఫాన్‌ బాధితులను ఆదుకుంటాం : జగన్మోహన్‌ రెడ్డి

జవాద్‌ తుపాన్‌ వల్ల ధన, ప్రాణ నష్టం కలిగిన బాధితులకు వెంటనే నష్ట పరిహారమివ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. తుపాన్‌ కారణంగా రాజంపేట నియోజవర్గంలోని అన్నమయ్య ప్రాజెక్ట్‌,పించ ప్రాజెక్ట్‌కు జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితులకు తగిన నష్ట పరిహారం ఇవ్వాలని రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంటకట మల్లికార్జునరెడ్డి సిఎం జగన్మోహన్‌రెడ్డికి వివరించారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి తక్షణమే నష్ట పరిహారంతో పాటు,పించ ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు కు సంభందించిన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ అకేపాటి అమర్‌ నాథ్‌ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.