తెలంగాణలో ఇద్దరు డాక్టర్లకు కరోనా
తెలంగాణలో ఇద్దరు డాక్టర్లకు కరోనా

తెలంగాణలో ఇద్దరు డాక్టర్లకు కరోనా

తెలంగాణలో తాజాగా మరో మూడు కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దోమలగూడకు చెందిన ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. వైరస్‌ సోకిన ఇద్దరు డాక్టర్లు కూడా భార్యాభర్తలు కావడం గమనార్హం. అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన మరో వ్యక్తి నమూనాలు పరీక్షించగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 44కు చేరింది.